విదేశీ మద్దతు వల్లే ప్రధాని అయ్యారంటూ నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ సవాల్

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

దేశ ప్రజలను మోదీ పదేపదే మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విదేశీ సహాయం వల్లే ఆయన ప్రధాని అయ్యారని, ఇప్పటికీ అదే మద్దతుతో కొనసాగుతున్నారని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సోషల్ మీడియా కూడా విదేశీ శక్తుల చేతిలోనే పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ప్రధాని మోదీకి ఆయన సవాల్ విసిరారు.