రూ.81.10 లక్షలకు మనుబోలు పశువుల సంత వేలంపాట దక్కించుకున్న మల్లికార్జున్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన పశువుల సంత వేలంపాటలో కోవూరుకు చెందిన పుబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి రూ.81.10 లక్షలకు పాట దక్కించుకున్నారు. డిపాజిట్ రూ.20 వేలుగా నిర్ణయించగా ముగ్గురు పోటీ పడ్డారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.