కేటీఆర్ వ్యాఖ్యలపై సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: Siricilla

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన మండిపడ్డారు. హోటళ్లలో చిప్పలు కడిగిన నీకు అర్థం కాదని, కావాలంటే ఫాంహౌస్ లలో పడుకున్న నీ అయ్యను అడుగు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేపాయి.