సోనిపట్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు దుండగులకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: గోపి
స్థలం: హర్యానా
హర్యానాలోని సోనిపట్‌లో వ్యాపారిని బెదిరించి రూ. 2 కోట్ల వసూళ్లకు పాల్పడి కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఖర్ఖోడా ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. అంకిత్, హర్ష్‌లుగా గుర్తించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.