లండన్ నుండి బంగ్లాదేశ్ వెళ్తున్న విమానంలో ప్రయాణికుల మధ్య భీకర ఘర్షణ
రిపోర్టర్: సురేష్
స్థలం: World
లండన్ నుండి బంగ్లాదేశ్ వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లో ఉండగానే పరస్పరం భీకరంగా కొట్లాడుకున్నారు. ఈ ఘటనతో విమానంలో ఉన్న చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడదీయడంతో ఘర్షణ సద్దుమణిగింది.