ల్యాంకాషైర్ నిర్ణయంపై జేమ్స్ అండర్సన్ ఆవేదన: క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి

రిపోర్టర్: అశోక్ స్థలం: లండన్

లంకాషైర్ కౌంటీ క్లబ్ తన కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకపోవడంపై అనుభవజ్ఞడైన పేసర్ జేమ్స్ అండర్సన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇష్టమైన జట్టు నుంచి అనూహ్యంగా ఎదురైన ఈ అనుభవం షాక్కు గురిచేసిందని, భవిష్యత్తులో ఆట కొనసాగించాలా వద్దా అనేదానిపై ఇంకా స్పష్టత లేదని ఆయన వెల్లడించారు. తన కెరీర్ ముగింపు ఇలా ఊహించలేదని, ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేసినట్లు బీబీసీ పాడ్కాస్ట్ వేదికగా అండర్సన్ వాపోయారు.