వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఆ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారికంగా టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న చిన్న శ్రీను రాకతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, టీడీపీ మరింత పటిష్టమైందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.