తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు కల్పవృక్ష వాహనసేవ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Tirupati
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వివిధ రాష్ట్రాల కళాకారుల సంప్రదాయ కళారూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.