ఉత్తరాంధ్రకు ముంచెత్తనున్న తీవ్ర వాయుగుండం భారీ వర్ష సూచన
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష గండం పొంచివుంది. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 22 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.