భారీ బడ్జెట్ రామాయణం సినిమా కొత్త పోస్టర్లు విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

బాలీవుడ్లో అత్యంత భారీ ప్రతిష్టాత్మక నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తుండగా తొలి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.