టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
చంద్రబాబు బతికి ఉన్నంతకాలం వివేకా హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని YSR Congress Party (YSRCP) పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శవ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని ధ్వజమెత్తారు. వివేకానంద రెడ్డి హత్య ద్వారా వైఎస్ జగన్కు ప్రయోజనం చేకూరిందనడంలో వాస్తవం లేదని, ఆ లబ్ధి టీడీపీకే దక్కిందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పదవులు ఇస్తారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.