రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్: కేంద్రం కీలక అనుమతులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో సుమారు లక్షా మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని సిఫారసు చేసింది. దీనితో సుమారు ఐదు వేల ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ భారీ పరిశ్రమ నిర్మాణ పనులకు త్వరలోనే మార్గం సుగమం కానుంది.