రామాయణం సినిమా పాట వివాదంపై స్పందించిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

రామాయణం చిత్రంలోని మంగళ్ రంగ్ పాటపై వస్తున్న విమర్శలపై ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ స్పందించారు. తెరపై రణ్బీర్ కపూర్, సాయి పల్లవిల మధ్య స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబించడమే తమ సంగీత బృందం ఏకైక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కళను ఎవరికి నచ్చినట్లు వారు అర్థం చేసుకుంటారని, అయితే తమ అంకితభావం మాత్రం భక్తితో కూడినదంటూ అర్మాన్ స్పష్టం చేశారు.