చెజ్ ఒలింపియాడ్‌లో ఉజ్బెకిస్తాన్ చేతిలో భారత్‌కు మొదటి ఓటమి
రిపోర్టర్: గోపి
స్థలం: Uzbekistan
సమర్‌కండ్ వేదికగా జరుగుతున్న 46వ చెస్ ఒలింపియాడ్ ఆరో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్తాన్ చేతిలో భారత ఓపెన్ జట్టు 2.5-1.5 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది మొదటి ఓటమి కాగా ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, గుకేష్ తమ మ్యాచ్‌లను డ్రా చేసుకున్నారు. అయితే నిహాల్ సరీన్ తన గేమ్‌లో కీలక సమయంలో క్వీన్‌ను కోల్పోయి ఓడిపోవడంతో ఉజ్బెకిస్తాన్ విజయం సాధించింది.