టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర వాతావరణ అలజడి, భయంతో ప్రయాణికుల కేకలు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఇస్తాంబుల్ నుండి ట్యునీషియా వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన వాతావరణ అలజడికి గురైంది. తుఫాను పరిస్థితుల మధ్య పైలట్ మూడుసార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించగా విమానం ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణికులు కేకలు వేశారు. ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా వేరే ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి దించారు.