రష్మిక మైసా సినిమా నుంచి అదిరిపోయే యాక్షన్ టీజర్ విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: భారతదేశం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం మైసా టీజర్ తాజాగా విడుదలైంది. కేరళ నేపథ్యంలో గిరిజనుల కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక తన తండ్రి కోసం, తన ప్రజల కోసం పోరాటం చేసే శక్తివంతమైన గిరిజన యువతిగా సరికొత్త మాస్ పాత్రలో కనిపించనున్నారు. టీజర్ నిండా అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, నీళ్లలో చేసే సాహసాలతో నింపేయగా, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.