విజయ్ సర్ రాజకీయ అడుగులపై ప్రశంసల జల్లు కురిపించిన నటి సమంత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: చెన్నై

నటుడు విజయ్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి రావడం చాలా కష్టమైన నిర్ణయమని, ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తెలిపారు. సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ తమిళ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తనకెంతో ఇష్టమైన హీరో విజయ్ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీని వీడి ప్రజల కోసం నాయకుడిగా మారిన ఆయన అంకితభావాన్ని, లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతను తాను ఎంతగానో అభినందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.