ఆర్టీసీ బస్సులో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రయాణం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ముషీరాబాద్ డిపో నుంచి శ్రీశైలానికి బయలుదేరిన ఆర్టీసీ స్పెషల్ బస్సులో భక్తులు వినాయక విగ్రహాలను సీట్లలో కూర్చోబెట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించడం విశేషంగా నిలిచింది. లారీలు, ట్రాక్టర్లలో విగ్రహాలను తీసుకెళ్లే బదులు ఆర్టీసీ బస్సును ఆశ్రయించి దేవుడిని గమ్యస్థానానికి చేరుస్తున్న ఈ వినూత్న ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, నగరంలోనూ తీవ్ర ఆసక్తికర చర్చగా మారింది.