కర్నూలులో ఈఎన్టీ వైద్యులకు గొర్రె తలలతో శస్త్రచికిత్సలపై ప్రత్యేక శిక్షణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్నూలు
కర్నూలు వైద్యకళాశాలలో 44వ రాష్ట్రస్థాయి ఈఎన్టీ వైద్యుల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మనిషి అవయవాలకు చేసే శస్త్రచికిత్సలపై మెలకువలు నేర్పించేందుకు గొర్రె తలలు, పంది ఊపిరితిత్తులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ఈఎన్టీ నిపుణులు, పీజీ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.