'వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి': సింగిల్ విండో విధానంపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Prakasam
ప్రకాశం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ఉత్సవ నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ ఉత్సవాల అనుమతులను తప్పనిసరిగా సింగిల్ విండో విధానం ద్వారానే పొందాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.