యెమెన్ జైలుపై సౌదీ అరేబియా భీకర వైమానిక దాడులు

రిపోర్టర్: శివ స్థలం: యెమెన్

యెమెన్‌లోని అల్-జౌఫ్ ప్రావిన్స్ రాజధాని అల్-హజ్మ్‌లో తమ ఆధీనంలో ఉన్న జైలుపై సౌదీ అరేబియా వైమానిక దాడులు నిర్వహించిందని హౌతీ రెబల్స్ తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడిలో బందీలుగా ఉన్న ఖైదీలు లక్ష్యంగా మారారని, హౌతీల ఖైదీల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ అబ్దుల్ ఖాదర్ అల్-ముర్తాదా ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మోచాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు చిన్నారులు, మహిళ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.