కూతురిని కాపురానికి పంపాలని బెదిరింపు: మనవరాలి నగ్నచిత్రాలు వైరల్ చేసిన అల్లుడు అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుపతి
కూతురిని కాపురానికి పంపకపోతే మనవరాలి నగ్నచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ అత్తను బెదిరించిన అల్లుడిపై తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ మద్దయ్యాచారి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బిరుదాల ఈశ్వర్రెడ్డి గతంలోనూ సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించి జైలుకు వెళ్లాడని, తాజాగా బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ ఈ దురాగ్యానికి పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.