మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలు వెల్లడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ములుగు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల చిన్న జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. గద్దెల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జాతర జరగనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 17న చిన్న జాతర ప్రారంభమవుతుందని, 20న ముగింపు ఉంటుందని తెలిపారు. ఈ ఉత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా తదితర ఏర్పాట్లను అధికారులు వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు.