గణేశ్ నిమజ్జనం వేళ మూడు జిల్లాల కార్యాలయాలకు సెలవు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఈ నెల 25న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి మరియు హైదరాబాద్ పరిధిలోని ఉద్యోగులు, విద్యార్థులకు నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు వెసులుబాటు లభించింది.