సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ యూజర్ల ప్రైవసీకి గండి: కొత్త కోడ్స్ లీక్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

ఎక్స్ ప్లాట్ఫారమ్లో లింక్ షేర్ చేస్తే ఏ డివైజ్ వాడారనేది స్పష్టంగా తెలుస్తుందని సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా డెస్క్టాప్ బ్రౌజర్ల ద్వారా కాపీ చేసే లింక్లకు ఎక్స్ ప్రత్యేక ట్రాకింగ్ కోడ్స్ను జోడిస్తోందని ఎక్స్ యూజర్ నికో వెల్లడించారు. ఈ కొత్త పరిణామం ఆన్లైన్ ప్రైవసీ భద్రతపై తీవ్ర చర్చకు దారితీసిందని, యూజర్లు లింక్లను ఫార్వర్డ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.