పంజాబ్లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: ఏడు కిలోల హెరాయిన్ సీజ్

రిపోర్టర్: సునీల్ స్థలం: Pathankot

పంజాబ్లో డ్రగ్స్ నివారణ కోసం చేపట్టిన యుద్ధ్ నషియాన్ విరుధ్ అభియాన్లో భాగంగా పఠాన్కోట్ పోలీసులు అంతర్జాతీయ సరిహద్దు హెరాయిన్ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. నలభై కోట్ల విలువైన ఏడు కేజీలకు పైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న క్రాస్ బడర్ లింకులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, ఫైనాన్షియల్ ట్రైల్ను కూడా పరిశీలిస్తున్నామని ఆయన బుధవారం స్పష్టం చేశారు.