దేశవ్యాప్తంగా అనలాగ్ పన్నీర్ పై నిషేధం విధించే ఆలోచనలో ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

దేశవ్యాప్తంగా అనలాగ్ పన్నీర్ పై నిషేధం విధించే అంశంపై భారత ఆహార భద్రతా ప్రమాపాల ప్రాధికార సంస్థ కసరత్తు చేస్తోంది. పాలు కాకుండా వృక్ష నూనెలు, కొవ్వులు, ప్రొటీన్లతో తయారు చేసే ఈ నకిలీ పన్నీర్ పై ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాలు ఆంక్షలు విధించగా, సెప్టెంబర్ 24న జరిగే సమావేశంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించి పూర్తి నిషేధంపై ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నిర్ణయం తీసుకోనుంది.