గిరిజన రైతులను మోసం చేస్తే పోరాటం తప్పదన్న తల్లోజు ఆచారి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర వ్యత్యాసం చూపుతూ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆరోపించారు. ఆమనగల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకే బేస్ విలువ ఉన్న భూములకు వేర్వేరుగా పరిహారాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. గిరిజనులకు పూర్తి న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.