‘ది ప్యారడైజ్’ చిత్రంలో దసరాను మించిన యాక్షన్ ఉంటోంది: రామ్ లక్ష్మణ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ హెవీ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఇండియన్ స్క్రీన్‌పై ఎన్నడూ చూడని విధంగా హీరో రెండు జడలతో, బేర్ బాడీతో కనిపించనున్నారని, ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారని వారు వెల్లడించారు.