భారత్‌కు ఎస్-57 స్టెల్త్ యుద్ధ విమానాల విక్రయంపై రష్యా కీలక ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో క్రెమ్లిన్ కీలక ప్రకటన చేసింది. భారత్‌కు అత్యాధునిక ఎస్-57 స్టెల్త్ యుద్ధ విమానాల విక్రయం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై చర్చలు జరుగుతున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అలాగే బ్రహ్మోస్ క్షిపణుల అభివృద్ధి, ఎస్-400 రక్షణ వ్యవస్థల సరఫరా, అణు సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక చర్చే ప్రధాన ఎజెండాగా ఉందని స్పష్టం చేశారు.