వరంగల్ ఎంజీఎం వద్ద మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం దవాఖానలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మార్చురీ వైపు నుంచి లోపలికి వెళ్తున్న ఆయనను అడ్డుకున్న పోలీసులు, విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో వరంగల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.