మహారాష్ట్రలో భారీ పెట్టుబడులు: 8.57 లక్షల కోట్లతో 67 ఒప్పందాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Mumbai
మహారాష్ట్రలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ముంబై వేదికగా జరిగిన కార్యక్రమంలో సుమారు ఎనిమిది లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి విలువైన అరై ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా సుమారు రెండు లక్షల తొంభై ఒక్క వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు.