పోచంపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భూదాన్ పోచంపల్లి

భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ను డీఐజీ జోయెల్ డేవిస్, ఎస్పీ అక్షార్ష్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం వారు రికార్డులను, కేసుల పురోగతిని పరిశీలించారు. దర్యాప్తును మరింత వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడాలని అధికారులను ఆదేశించారు.