కోనసీమలో తుపాను బీభత్సం: పదివేల విద్యుత్ స్తంభాలు ధ్వంసమై అంధకారం
రిపోర్టర్: విజయ్
స్థలం: అంబేద్కర్ కోనసీమ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుపాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని, రెండు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. తుపాను ధాటికి సుమారు పదివేల విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి రెండు వేల మంది సిబ్బందిని రప్పించి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు వేగంగా నిర్వహిస్తున్నామని, ఈ రాత్రికి మండల కేంద్రాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.