మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే: వికలాంగుడికి సిమెంట్ బస్తాలు అందజేత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు ఇప్పల రమేష్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం నిమిత్తం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన ఫౌండేషన్ తరఫున యాభై బస్తాల ఉచిత సిమెంటును అందజేశారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ సాయం లబ్ధిదారుడికి చేరింది. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.