గుండెపోటుతో ఏఐటీయూసీ నాయకుడు బంధం కిషోర్ మృతి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం

చింతకాని మండలం మత్కేపల్లి గ్రామానికి చెందిన ఏఐటీయూసీ నాయకుడు బంధం కిషోర్ గుండెపోటుతో మృతి చెందారు. కార్మిక హక్కుల పోరాటాల్లో కిషోర్ ఎప్పుడూ ముందుండేవారని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. మృతదేహంపై పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్ముల జితేందర్ రెడ్డి, దూసరి గోపాలరావు తదితరులు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.