నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏఈఈఎస్ లో 254 టీచర్ పోస్టుల భర్తీ

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్ లో రెండు వందల యాభై నాలుగు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ మరియు లైబ్రేరియన్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు వారు వెల్లడించారు. నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.