'మానవత్వం మరిస్తే ఎలా': రాజాంలో అంత్యక్రియలకు సీఐ నవీన్‌కుమార్‌ ఆర్థిక సాయం

రిపోర్టర్: శివ స్థలం: రాజాం

పార్వతీపురం మన్యం జిల్లా రాజాం పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన వెంకటరావు అనారోగ్యంతో మృతి చెందగా, భర్త మృతదేహం వద్ద భార్య పుణ్యవతి ఆర్థిక స్థోమత లేక రోదిస్తున్న విషయాన్ని గమనించిన రాజాం సీఐ నవీన్‌కుమార్‌ చలించిపోయి స్వయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. తోటి వ్యక్తి మృతి చెందితే ఆదుకోవాల్సిన స్థానికుల తీరును ఆయన తీవ్రంగా మందలించి, స్వయంగా దగ్గరుండి దహన సంస్కారాలు పూర్తి చేయించారు.