అక్టోబర్ రెండున గ్రాండ్ గా తత్వం చిత్రం విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మర్డర్ మిస్టరీ జానర్ లో రూపొందిన తత్వం సినిమాను అక్టోబర్ రెండున గ్రాండ్ గా థియేట్రికల్ విడుదలకు సన్నద్ధం చేసినట్లు చిత్ర దర్శకుడు అర్జున్ కోలా వెల్లడించారు. దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రమోషన్స్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కంటెంట్ పై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరించి ఘనవిజయం చేయాలని చిత్ర యూనిట్ కోరింది.