పది సంవత్సరాలే బతుకుతానన్నారు: పమేలా ఆండర్సన్ భావోద్వేగం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
తొంభైల చివర్లో హెపటైటిస్ సి సోకినప్పుడు తనకు పదేళ్లే ఆయువు ఉంటుందని డాక్టర్లు చెప్పారని ప్రముఖ నటి పమేలా ఆండర్సన్ వెల్లడించారు. అప్పట్లో ఆ వ్యాధికి మందు లేకపోవడంతో మరణశిక్షలా అనిపించిందని తెలిపారు. చిన్న పిల్లల భవిష్యత్తు గురించి భయపడ్డానని, ఆ వ్యాధి తన జీవితాన్ని తల్లకిందులు చేసిందని అమ్ఫార్ వెనిస్ గాలా వేదికపై ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.