దుకాణాలు బలవంతంగా మూయించారంటూ బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించేలా కన్నాట్ ప్లేస్ లో దుకాణాలను బలవంతంగా మూయించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పండుగ సీజన్ లో వ్యాపారులను ఆదుకోవాలని పిలుపునిచ్చినా బీజేపీ నేతలు కావాలనే దుకాణాలు మూసివేయించి నష్టం కలిగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.