దివంగత కాంగ్రెస్ నేత ప్రమోద్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన నాతరి స్వామి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భీమిని

మంచిర్యాల జిల్లా భీమిని మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతంగి ప్రమోద్ గౌడ్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురై అనారోగ్యంతో సెప్టెంబర్ 12న మృతి చెందారు. ఆదివారం భీమిని మండలం వడాల్ గ్రామంలో ఆయన నివాసంలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి హాజరై ప్రమోద్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.