టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉత్సాహం

రిపోర్టర్: సతీష్ స్థలం: Auckland

న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉత్సాహంగా పాల్గొన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రాక్టీస్ నెట్స్ లో ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు ఎంతో సరదాగా గడుపుతూ, తోటి ఆటగాళ్లతో ముచ్చటించినట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.