తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం: మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ వంశీకృష్ణ లేఖ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: పెద్దపల్లి

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి బహిరంగ సభకు మంత్రి శ్రీధర్ బాబు గైర్హాజరు కావడంపై ఆయన లేఖ ద్వారా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అందరికీ ఒకే నిబంధన వర్తించాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.