సర్వేల్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల బాలుర పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు ఎంతో మంది గొప్ప స్థానాలకు ఎదిగారని, ప్రస్తుత విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చైర్మన్ బక్కి వెంకయ్య పిలుపునిచ్చారు.