గంగాధర నెల్లూరులో ఓట్ల వేటలో దూసుకెళ్లిన షర్మిల గుణశేఖర్ రెడ్డి

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు పంచాయతీలో వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల గుణశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరిజనవాడ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.