జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బెంగళూరుకు చెందిన రాధా రాజేష్ ఎంపిక

రిపోర్టర్: గోపి స్థలం: Bengaluru

బెంగళూరులోని న్యూ హారిజన్ పబ్లిక్ స్కూల్ బయాలజీ విభాగం హెడ్ రాధా రాజేష్ జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా, వాస్తవ ప్రపంచ ఉదాహరణలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించినందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు.