ప్రకాశం జిల్లాలో విషాదం: తామర పూల కోసం చెరువులో దిగి ఇద్దరు బాలురు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు ఆరో తరగతి బాలురు తామర పూల కోసం చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు. కొలకలూరి నిశాంత్, కండ్లగుంట నాగచైతన్య అనే విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారని స్థానికులు తెలిపారు. బాలురు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయని అధికారులు వెల్లడించారు.