పంజాబ్‌లో పురుగులమందు తాగి నిరసన తెలిపిన వ్యక్తిపై తొమ్మిది కేసులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Punjab
పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలో డ్రగ్స్ విక్రయాలకు వ్యతిరేకంగా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగులమందు తాగి నిరసన తెలిపిన జగ్శీర్ సింగ్ అలియాస్ జగ్గాపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నిరసనకారుడిగా ముందుకొచ్చిన జగ్గాపై ఎన్డీపీఎస్ చట్టం కింద తొమ్మిది కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామం ఆప్ ప్రభుత్వంపై దాడి చేస్తున్న విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.