నర్సంపేటలో అర్హులైన పేదలకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
రిపోర్టర్: ఇజం జర్నలిసిం ✍️✍️
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.